Wednesday, January 1, 2025

మెగా వేలంలో స్టార్ క్రికెటర్లకు షాక్..

- Advertisement -
- Advertisement -

మెగా వేలంలో అమ్ముడుపోని వార్నర్, కేన్, మయాంక్
శార్దూల్, పృథ్వీ, సర్ఫరాజ్‌లకు నిరాశే
వీరిపై ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు
జెడ్డా: సౌదీ అరేబియాలోని జెడ్డా నగరం వేదికగా ఆది, సోమవారాల్లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెగా వేలం పాటలో పలువురు స్టార్ క్రికెటర్లకు షాక్ తగిలింది. ఒకప్పుడూ ఐపిఎల్‌లో కోట్లాది రూపాయలకు అమ్ముడు పోయి పెను ప్రకంపనలు సృష్టించిన ఆటగాళ్లు ఈసారి ఆయా ఫ్రాంచైజీలు మొండి చెయ్యి ఇచ్చాయి. ఐపిఎల్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన క్రికెటర్లలో ఒకరిగా పేరున్న డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్), మహ్మద్ నబి (అఫ్గాన్), షకిబ్ (బంగ్లాదేశ్), ముస్తఫిజుర్ (బంగ్లాదేశ్), టిమ్ సౌథి, ఫిన్ అలెన్ (కివీస్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) తదితరులను కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు.

రెండు రోజుల పాటు సాగిన వేలం ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా వీరిను పట్టించుకోలేదు. వీరితో భారత స్టార్ క్రికెటర్లు ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, పృథ్వీషా, సర్ఫరాజ్ ఖాన్, మయాంక్ అగర్వాల్, శివమ్ మావి, నవ్‌దీప్ సైని తదితరులను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. వీరిని వారి కనీస ధరకు కూడా కొనేందుకు జట్టు యాజమాన్యాలు ఇష్టపడక పోవడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News