Wednesday, January 22, 2025

వార్నర్ సంచలన నిర్ణయం

- Advertisement -
- Advertisement -

వార్నర్ సంచలన నిర్ణయం
పాక్ సిరీస్ తర్వాత టెస్టులకు గుడ్‌బై!
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఏడాది పాకిస్థాన్‌తో జరిగే సిరీస్ తర్వాత టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. 2024 జనవరిలో సిడ్నీ వేదికగా పాకిస్థాన్‌తో జరిగే టెస్టు మ్యాచ్ తర్వాత ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతానని వార్నర్ పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై మరింత దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో సంప్రదాయ టెస్టులకు వీడ్కోలు పలుకుతున్నట్టు వెల్లడించాడు. చాలా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నానని వార్నర్ స్పష్టం చేశాడు. వచ్చే జనవరిలో పాకిస్థాన్‌తో సిడ్నీలో జరిగే టెస్టు తన కెరీర్‌లో చివరిదన్నాడు. ఈ విషయాన్ని వార్నర్ శనివారం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇదిలావుంటే రానున్న డబ్లూటిసి ఫైనల్, యాషెస్ సిరీస్‌లలో మెరుగైన ప్రదర్శన చేయడమే లక్షంగా పెట్టుకున్నానన్నాడు.

భారత్‌తో జరిగే డబ్లూటిసి ఫైనల్ తనకు చాలా కీలకమన్నాడు. ఇందులో రాణించడం ద్వారా రానున్న యాషెస్ సిరీస్‌లో జట్టులో సంపాదించడమే లక్షంగా పెట్టుకున్నానన్నాడు. ఇదిలావుంటే వన్డేలతో పాటు టి20 ఫార్మాట్‌లలో మరికొంత కాలం పాటు కొనసాగుతాతనన్నాడు. కాగా, సుదీర్ఘ కెరీర్‌లో వార్నర్ 103 టెస్టుల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ క్రమంలో 45.57 సగటుతో 8,158 పరుగులు చేశాడు. ఇందులో 25 శతకాలు, మరో 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా అత్యుత్తమ బ్యాటర్లలో వార్నర్ ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. మూడు ఫార్మాట్‌లలో కూడా మెరుగైన బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News