Wednesday, January 22, 2025

అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు డేవిడ్ వార్నర్ వీడ్కోలు…

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వీడ్కోలు పలికాడు.  సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్ట్‌ అనంతరం వార్నర్ తన టెస్ట్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాడు. చివరి సిరీస్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన వార్నర్.. చివరి మ్యాచ్‌లో అర్ధశతకం సాధించాడు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం వార్నర్ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రేక్షకులు స్టేడియంలో వార్నర్ కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.

డేవిడ్ వార్నర్ తన 13 ఏళ్ల సుదీర్ఘ టెస్టు క్రికెట్.. ఆస్ట్రేలియా తరపున మొత్తం 112 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 205 ఇన్నింగ్స్‌లల్లో 3 డబుల్ సెంచరీలు, 26 సెంచరీలు, 37 అర్ధసెంచరీలతో 8,786 పరుగులు చేశాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News