Monday, December 23, 2024

ఐకాన్ స్టార్‌కి ‘పుష్ప’ స్టైల్‌లో బర్త్ డే విషెస్ చెప్పిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ (వీడియో)

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియన్ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి 41వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన కూతురు ఇస్లా రోజ్ తో కలిసి పుష్ప స్టయిల్ లో శుభాకాంక్షలు చెబుతూ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘బిగ్ స్టార్, బిగ్ మ్యాన్ అల్లు అర్జున్ కు హ్యాపీ బర్త్ డే. పుష్ప2 కోసం మేం వేచి చూస్తున్నాం’అని వార్నర్ పేర్కొన్నారు.

పక్కనే ఉన్న ఇస్లా హ్యాపీ బర్త్ డే పుష్ప అని క్యూట్ గా విషెస్ చెప్పింది. తన బహుముఖ నటనతో అల్లు అర్జున్ చిత్ర పరిశ్రమలో ఐకాన్ స్టార్ గా ఎదిగిన విషయం తెలిసిందే. టాలీవుడ్ సినిమాలకు డైలాగ్స్ చెబుతూ.. పాటలకు స్టెప్పులు వేస్తూ ఆ వీడియోలను సామాజిక మాద్యమాల్లో పంచుకుంటున్నాడు వార్నర్. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలో పాటలకు వార్నర్ వేసిన స్టెప్స్ కు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. వార్నర్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖ నటులు అల్లు అర్జున్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News