Thursday, December 26, 2024

ముంబై గల్లీ పిల్లలతో డేవిడ్ వార్నర్ క్రికెట్

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: మన దేశంలో జరిగే గల్లీ క్రికెట్ అంటే విదేశీయులు సైతం పడిచస్తుంటారు. తాము కూడా అందులో ఒక చేయి వేయాలని తహతహలాడుతుంటారు. తాజాగా ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ వీరుడు దేవిడ్ వార్నర్ సైతం ఇండియన్ గల్లీ క్రికెట్‌లో తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇటీవల ముంబైలోని ఒక వీధిలో పిల్లలతో కలసి వార్నర్ కూడా క్రికెట్ ఆడారు.

ఇందుకు సంబంధించిన వీడియోను వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. బ్యాటింగ్ చేయడానికో ప్రశాంతమైన వీధి దొరికిందంటూ ఆయన తన వీడియోకు కామెంట్ పెట్టారు. వార్నర్ షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటికే 31 లక్షల మంది దీన్ని వీక్షించారు. వార్నర్‌లోని నిరాడంబరతకు నెటిజన్లు మంత్రముగ్ధులవుతున్నారు. వార్నర్‌కు భారత పౌరసత్వం ఇవ్వాలంటూ కొందరు డిమాండ్ చేయడం విశేషం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News