Monday, December 23, 2024

రికార్డు సృష్టించిన డేవిడ్ వార్నర్

- Advertisement -
- Advertisement -

మూడేళ్లుగా టెస్టుల్లో సెంచరీ చేయని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సౌతాఫ్రికాపై చెలరేగాడు. దక్షిణాఫ్రికాపై తన 100వ టెస్టులో సెంచరీతో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. దీంతో వార్నర్ టెస్టుల్లో 25 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. వందో టెస్టులో సెంచరీ చేసిన పదో ఆటగాడిగా రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు వందో వన్డేలోనూ సెంచరీ చేసిన వార్నర్, టెస్టులు.. వన్డేల్లో ఈ అరుదైన ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. తన 25వ టెస్టు సెంచరీని చేయడంలో అతను ప్రత్యేక మైలురాయిని సాధించిన ప్రముఖ క్రికెటర్ల సమూహంలో చేరాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News