- Advertisement -
మెల్‌బోర్న్: వచ్చే నెలలో ఆరంభం కానున్న ఐపిఎల్ సీజన్17లో ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టి20 సిరీస్ సందర్భంగా వార్నర్ గాయం బారీన పడ్డాడు. దీంతో వార్నర్ కివీస్‌తో జరిగే మూడో టి20 ఆడడం లేదు. వార్నర్ గజ్జల్లో నొప్పితో బాధపడుతున్నాడు.
ఈ పరిస్థితుల్లో త్వరలో ప్రారంభమయ్యే ఐపిఎల్‌లో అతను ఆడుతాడా లేదా అనేది సందేహంగా మారింది. ఐపిఎల్‌లో వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. వార్నర్ గాయంతో సతమతమవుతుండడంతో అతను ఐపిఎల్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. ఇదే జరిగితే ఢిల్లీ టీమ్‌కు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి.
- Advertisement -