Friday, January 10, 2025

అయోధ్యపై డేవిడ్ వార్నర్ సందేశం వైరల్

- Advertisement -
- Advertisement -

ప్రధాని చేతుల మీదుగా కన్నుల పండువగా జరిగిన అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై దేశదేశాలకు చెందిన ప్రముఖులు అబినందనలు కురిపిస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా చేరాడు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై వార్నర్ స్పందిస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ మెస్సేజ్ వైరల్ గా మారింది.

అయోధ్యలో సోమవారం జరిగిన ప్రాణ  ప్రతిష్ఠ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజనీకాంత్ వంటి  సినీ నటులు, సచిన్ టెండూల్కర్, వెంకటేశ్ ప్రసాద్, అనిల్ కుంబ్లే, సైనా నెహ్వాల్, రవీంద్ర జడేజా, మిథాలీ రాజ్ వంటి క్రీడాకారులు కూడా తరలివచ్చారు. భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల పట్ల ఆసక్తి కనబరిచే డేవిడ్ వార్నర్ ఈ కార్యక్రమంపై తనదైన శైలిలో స్పందించాడు. ఇన్ స్ట్రా గ్రామ్ లో ‘జై శ్రీరామ్ ఇండియా’ అంటూ మెస్సేజ్ చేశాడు. దీనిపై భారత క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వార్నర్ ను కృతజ్ఞతలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News