Friday, November 22, 2024

ఆస్ట్రేలియాకు మరో షాక్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న ఆస్ట్రేలియాకు మరో కోలుకోలేని షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ చివరి రెండు టెస్టులకు అందుబాటులో లేకుండా పోయాడు. ఇప్పటికే స్టార్ బౌలర్ హాజిల్‌వుడ్ గాయంతో టెస్టు సిరీస్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.

కాగా, రెండో టెస్టు సందర్భంగా వార్నర్ గాయం బారిన పడ్డాడు. దీంతో అతను చివరి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగలేదు. వార్నర్ స్టానంలో రెన్‌షా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చాడు. ఇదిలావుంటే గాయం పూర్తిగా తగ్గక పోవడంతో చివరి రెండు మ్యాచ్‌లకు వార్నర్ దూరమయ్యాడు.

అతని స్థానంలో ఎవరూ బరిలోకి దిగుతారో ఇంకా తేలలేదు. కాగా, ఈ సిరీస్‌లో తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమయ్యాడు. మూడు ఇన్నింగ్స్‌లలో కలిపి 26 పరుగులే చేశాడు. అయితే ఎలాంటి స్థితిలోనైనా మ్యాచ్ పరిస్థితిని తారుమారు చేసే సత్తా కలిగిన వార్నర్ సేవలు కోల్పోవడం ఆస్ట్రేలియాకు అతి పెద్ద ఎదురుదెబ్బగానే విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అంతేగాక భారత పిచ్‌లపై వార్నర్‌కు మంచి అవగాహన కూడా ఉంది. కానీ గాయంతో అతను మిగిలిన మ్యాచ్‌లకు దూరం కావడం జట్టును మరింత కలవరానికి గురిచేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News