Monday, December 23, 2024

సొంత క్రికెట్ బోర్డుపై డేవిడ్ వార్నర్ తీవ్ర విమర్శలు..

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సొంత క్రికెట్ బోర్డుపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వ్యవహరించిన తీరుతో తాను ఎంతో మనో వేదనకు గురయ్యానని వాపోయాడు. కెప్టెన్ అయ్యే అవకాశం లేకుండా జీవితకాల నిషేధాన్ని విధిండంపై వార్నర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

జాతీయ జట్టుకు కెప్టెన్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నా ఫలితం లేకుండా పోయిందన్నాడు. బాల్ టాంపరింగ్ అనేది ముగిసిన ఆధ్యాయనం అని దాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అత్యంత జఠిలమైన సమస్యగా మార్చిందని ఆరోపించాడు. తనపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లితే అక్కడ కనీస మద్దతు కూడా లభించలేదన్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News