హీరో నితిన్ మోస్ట్ ఎవైటెడ్ హీస్ట్ కామెడీ రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. ఈ చిత్రంలో ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒక ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు. ఈ చిత్రం నుండి అతని ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. డేవిడ్ వార్నర్ షార్ట్ హెయిర్ కట్‌లో ట్రెండీ దుస్తులు ధరించి పోస్టర్‌లో ఫుల్ స్వాగ్‌తో ఆకట్టుకున్నారు. రాబిన్ హుడ్‌లో వార్నర్ పాత్ర అతిధి పాత్ర అయినప్పటికీ, అతని ప్రపంచ ప్రజాదరణ, మాసీవ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ సినిమాపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ చిత్రంతో అతని అసోషియేషన్ భారీ సంఖ్యలో ప్రేక్షకులను అలరించనుంది. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను త్వరలో విడుదల చేయనున్నారు మేకర్స్.
‘రాబిన్ హుడ్’ నుంచి ఫస్ట్ లుక్
- Advertisement -
- Advertisement -
- Advertisement -