- Advertisement -
ప్రముఖ ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ త్వరలో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడు. ఇప్పటికే టెస్టులకు, వన్డేలకూ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్, అమెరికాలలో జూన్ లో జరిగే వరల్డ్ కప్ తర్వాత టీ20లనుంచి కూడా వైదొలగనున్నట్లు ప్రకటించాడు. వార్నర్ జనవరి 6న టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత వన్డేలకూ గుడ్ బై చెప్పాడు.
2011లో టెస్ట్ క్రికెట్ లోకి ప్రవేశించిన వార్నర్ 112 టెస్టులు ఆడాడు. 205 ఇన్నింగ్స్ లో మూడు డబుల్ సెంచరీలు, 26 సెంచరీలు, 36 అర్థ సెంచరీలతో 8,786 పరుగులు చేశాడు. టెస్టుల్లో వార్నర్ అత్యధిక స్కోరు 335 పరుగులు. వన్డేల్లో 161 మ్యాచ్ లు ఆడి, 22 సెంచరీలు, 33 అర్థ సెంచరీలతో 6932 పరుగులు చేశాడు. 2009లో టీ20లు ఆడటం మొదలుపెట్టాడు. ఇప్పటివరకూ 100 మ్యాచ్ లు ఆడి, ఒక సెంచరీ, 25 అర్థ సెంచరీలతో 2964 పరుగులు చేశాడు.
- Advertisement -