హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 138 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ముందు ఉంచింది. ఢిల్లీ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. కానీ ఈ మ్యాచ్‌కు ముందు ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ ఆటగాడితో భువనేశ్వర్ కుమార్ మాట్లాడుతుండగా ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రన్నింగ్ చేస్తూ వచ్చి భువీ కాళ్లను పట్టుకున్నాడు. అనంతరం ఇద్దరు నవ్వుకుంటూ ఆలింగనం చేస్తుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో డేవిడ్ వార్నర్ హైదరాబాద్ జట్టు నుంచి ఆడినప్పుడు తెలుగు సినిమా పాటలపై డ్యాన్స్ చేయడంతో వైరల్ గా మారాయి. హైదరాబాద్ జట్టులో ఉన్నప్పుడు భువీ- డేవిడ్ మధ్య మంచి అనుబంధం ఉంది.
Also Read: అతనినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
This visual is all
![]()
!
Follow the match
https://t.co/ia1GLIWu00#TATAIPL | #SRHvDC | @SunRisers | @DelhiCapitals | @BhuviOfficial | @davidwarner31 pic.twitter.com/t9nZ95dyJ7
— IndianPremierLeague (@IPL) April 24, 2023