Wednesday, January 22, 2025

తీవ్ర అనారోగ్యంతో కరాచీ ఆసుపత్రిలో దావూద్ ఇబ్రహిం

- Advertisement -
- Advertisement -

విష ప్రయోగం జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం

న్యూఢిల్లీ: తీవ్రమైన అనారోగ్యంతో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం పాకిస్తాన్‌లోని కరాచీలోగల ఒక ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నట్లు సోమవారం వర్గాలు వెల్లడించాయి. అయితే దావూద్ ఇబ్రబ్రహింపై విషప్రయోగం జరిగిందంటూ సోషల్ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. కాని ఈ వార్తలను దావూద్‌కు చెందిన సన్నిహిత వర్గాలు ధ్రువీకరించలేదు. రెండు రోజుల క్రితం దావూద్ ఇబ్రహిం ఆసుపత్రిలో చేరినట్లు వర్గాలు చెప్పాయి. ఆసుపత్రిలో గట్టి భద్రత మధ్య అతనికి చికిత్స జరుగుతోందని వారు తెలిపారు.

మొత్తం అంతస్తులో అతనొక్కడే రోగి అని వారు చెప్పారు. ఆసుపత్రి సిబ్బంది, దావూద్ సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే ఆ అంతస్తు లోపలకు ప్రవేశం ఉందని వారు వివరించారు. దావూద్ బంధువులైన అలీషా పార్కర్, సాజిద్ వాగ్లే నుంచి అతని చికిత్సకు సంబంధించిన మరింత సమాచారాన్ని పొందేందుకు ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇలా ఉండగా దావూద్ ఇబ్రహిం రెండవ పెళ్లి చేసుకుని కరాచీలోనే ఉంటున్నాడని దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడు ఈ ఏడాది జనవరిలో జాతీయ భద్రతా సంస్థ(ఎన్‌ఐఎ) అధికారులకు వెల్లడించాడు. పాకిస్తాన్‌లోని కరాచీ విమానాశ్రయం దావూద్ అనుచరుల అధీనంలో ఉన్నట్లు ఎన్‌ఐఎ దావూద్‌పై దాఖలు చేసిన తన చార్జిషీట్‌లో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News