Monday, December 23, 2024

కరాచీలో దావూద్ విలాస జీవితం

- Advertisement -
- Advertisement -

బయటపెట్టిన డాన్ ఆడియో సంభాషణ

పాకిస్తాన్‌లోని కరాచీలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం ఆసుపత్రి పాలయ్యాడన్న వార్తల నేపథ్యంలో దావూద్‌కు, అతని అనుచరుడు ఫరూఖ్‌కు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వెలుగు చూసింది. అందులో దావూద్ కరాచీలో అనుభవిస్తున్న రాజభోగాలు, విలాసవంతమైన జీవితం కనపడుతుంది. జెడ్డా నుంచి లూయిస్ విట్టన్ షూస్ తీసుకురమ్మని దావూద్ తన అనుచరుడికి చెప్పడం ఫోన్ సంభాషనలో వినిపించింది.

దావూద్‌తో అనుచరుడు నేను ప్రతి నమాజ్‌లో..ప్రతి సందర్భంలో మీ కోసం ప్రార్థిస్తున్నాను అని చెప్పడం వినిపించింది. పాకిస్తాన్ దావూద్ ఇబ్రహింను కలుసుకోవాలన్న తన ఆలోచనను అనుచరుడు తెలియచేశాడు. రేపు..శుక్రవారం ప్రార్థనల తర్వాత నేను మక్కా బయల్దేరతాను. ఉమా నిర్వహిస్తాను. ఆ తర్వాత పాకిస్తాన్ వచ్చి కలుస్తాను అని అనుచరుడు దావూద్‌కు ఫోన్‌లో చెప్పాడు. అక్కడి నుంచి మీకోసం ఏమైనా తీసుకురావాలా అని అనుచరుడు ప్రశ్నించగా అందుకు దావూద్..జెడ్డాకు వెళతావా..అక్డ మనం ఒక షాపులో షూస్ కొనేవాళ్లం నీకు గుర్తుందా అని అడిగాడు.

ఫరూఖ్ జబావిస్తూ ఆ షాపు మూసేశారు. మరో షాపు నుంచి లూయిస్ విట్టన్ షాసూ తెస్తాను అని చెప్పాడు. తన షూస్ సైజు గురించి దావూద్ వివరాలు ఇస్తూ నా షూస్ సైజు 42 లేదా నంబర్ 9 అని తెలియచేయడంతోపాటు యుకె(బ్రిటన్), ఇయు(యూరోపియన్ యూనియన్) మధ్య సైజు వ్యత్యాసాల గురించి వివరించాడు. ఈ ఫోన్ సంభాషకు చెందిన ఆడియో క్లిప్ గురించి ఒక ఇంగ్లీష్ మీడియా గ్రూపు వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News