Friday, November 22, 2024

దావూద్ ఇబ్రహీం చనిపోయాడా? ఛోటా షకీల్ ఏమన్నాడంటే…

- Advertisement -
- Advertisement -

పేరుమోసిన డాన్ దావూద్ ఇబ్రహీం బతికే ఉన్నాడా? ఇప్పుడిది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారింది. ముంబయి పేలుళ్ల సూత్రధారి అయిన దావూద్, ఆ సంఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ కు పారిపోయాడు. అప్పటినుంచీ పాకిస్థాన్ అడ్డాగా తన అండర్ వరల్డ్ కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తున్నాడు. తాజాగా దావూద్ పై విషప్రయోగం జరిగిందనీ, కరాచీలోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో అతను చికిత్స పొందుతున్నాడని వార్తాకథనాలు వెలువడ్డాయి. దావూద్ చికిత్స పొందుతున్న ఆస్పత్రితోపాటు కరాచీ విమానాశ్రయంలోనూ పాక్ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.

అయితే విష ప్రయోగం కారణంగా దావూద్ మరణించాడనీ, ఈ వార్తను పాక్ ప్రభుత్వం గోప్యంగా ఉంచిందనీ పుకార్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో దావూద్ కు కుడిభుజంలా పనిచేసే అతని శిష్యుడు ఛోటా షకీల్ కీలకమైన వివరణ ఇచ్చాడు. ఒక ప్రముఖ పత్రికతో షకీల్ మాట్లాడుతూ దావూద్ మరణించాడన్న వార్తను కొట్టిపారేశాడు. దావూద్ వెయ్యి శాతం ఆరోగ్యంగా ఉన్నాడని స్పష్టం చేశాడు. అంతేకాదు, అతనిపై విష ప్రయోగం జరగలేదనీ, అవన్నీ వట్టి పుకార్లనీ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News