Thursday, January 23, 2025

89వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాదయాత్ర

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని ఇంద్రానగర్-ఏ, బిలలో ప్రగతియాత్రలో భాగంగా 89వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా మంచినీటి సమస్య, మిగిలిన సీసీ రోడ్లు, డ్రైనేజీ, కరెంటు కేబుల్ మార్చాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అక్కడే ఉన్న అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో డిజిఎం అప్పల నాయుడు, సీనియర్ నాయకులు రషీద్ బైగ్, అంజన్ గౌడ్, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, కమలాకర్, ఇబ్రహీం, మూసాఖాన్, సింగారం మల్లేష్, చిన్నా చౌదరి, ఇమ్రాన్ బైగ్, బస్తీ ప్రెసిడెంట్ జునైద్, అహ్మెద్ అలీ, కృష్ణ, బద్రి, సంతోష్, బషీర్, అమీర్, షఫీక్ అలీ, తాజ్, షబానా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News