Monday, January 20, 2025

ఎల్లుండి సింగరేణి ఎన్నికలు.. కాంగ్రెస్ కు తొలి పరీక్ష

- Advertisement -
- Advertisement -

గుర్తింపు హోదా కోసం పోటీ పడుతున్న 13 కార్మిక సంఘాలు

పాగా కోసం ఐఎన్‌టియుసి పట్టుదల

హ్యాట్రిక్ కోసం టిబిజికెఎస్ తహతహ

కాంగ్రెస్‌పై కాలు దువ్వుతున్న ఎఐటియుసి
అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ స్నేహ హస్తం.. ఎన్నికల్లో కయ్యం

మంత్రులు, ఎంఎల్‌ఎలకు సవాల్‌గా మారిన ఎన్నికలు

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మొ దటి నెలలోనే తొలి ఆగ్ని పరీక్ష ఎదురుకాబోతోంది. ఈ నెల 27న జరిగే సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్‌టియుసి సంఘం గెలుపుకోసం పార్టీ కృషి చే స్తోంది. గతంలో రెండు పర్యాయాలు విజయం సా ధించిన బిఆర్‌ఎస్ అనుబంధ బొగ్గుగని కార్మిక సం ఘం మరోసారి గెలిచి హ్యాట్రిక్ కోట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, సిపిఐ ఈ ఎన్నికల్లో వేర్వేరు గా పోటీ చేస్తూ కలబడటం ఆసక్తిని రేపుతోంది. రాష్ట్రంలో కొమరం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలోని 11 ఏరియాలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సింగరేణిలో ప్రస్తుతం సుమారు 40 వేల మంది కార్మికులున్నారు. 2017 అక్టోబర్ 5న సింగరేణి గుర్తింపు సంఘం ఎ న్నికలు జరుగగా ఆ ఎన్నికలలో బిఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికెఎస్) గెలిచింది. అంతకుముందు 2012లో జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే సంఘం గెలిచింది. మరోసారి పాగా వేసేందుకు బిఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘం పోటీ పడుతుండగా రా ష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్‌టియుసి కూడా విజయకేతనం ఎగురవేసేందుకు ఊవ్విళ్లూ రు తోంది. సింగరేణి కార్మికుల్లో సిపిఐ అనుబంధ కార్మిక సం ఘం ఎఐటియుసికి గణనీయమైన పట్టు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ పొత్తు పెట్టుకొని పనిచేయడంతో పాటు పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించిన సింగరేణి హెడ్ క్వార్టర్ అయిన కొత్తగూడెం స్దానంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. అయితే సింగరేణి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్, సిపిఐ అనుబంధ కార్మిక సంఘాలు వేర్వేరుగా పోటీలో నిలబడ్డాయి. కాగా, ఈ ఎన్నికల్లో పోటీకి దూరం గా ఉండాలని బిఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘం ముందు భావించినప్పటికీ ఆ తరువాత కార్మిక సంఘ నేతల ఒత్తిడితో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బిఆర్‌ఎస్ అనుబంధ సంస్థ టిబిజికెఎస్, సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఎఐటియుసి, కాం గ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టియుసి యూనియన్ల మధ్యే ప్రధాన పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.సిఐటియు, బిఎంఎస్, హెచ్‌ఎంఎస్ జాతీయ సంఘాలు కూడా పోటీలో ఉండి ఉనికి కోసం పాకులాడుతున్నాయి.

గుర్తింపు సంఘం హోదాకోసం కదం తొక్కుతున్న సంఘాలు
నల్లబంగారాన్ని వెలికితీస్తూ ప్రపంచానికి వెలుగులను విరజిమ్ముతున్న 135 ఏళ్ళ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థలో కార్మిక గుర్తింపు సంఘం హోదాను దక్కించుకునేందుకు సంఘాలు కదం తొక్కుతున్నాయి. ఉత్తర తెలంగాణలో గోదావరి తీరంలోని ఆరు జిల్లాల పరిధిలో 350 కి.మీ పొడవునా 11 ఏరియా (సింగరేణి కోల్ బెల్ట్)లో 23 అండర్ గ్రౌండ్ మైన్స్, 19 ఓపెన్ కాస్టు గనులతో 11 డివిజన్, 3 రీజినల్ ఆఫీస్‌లతో ఏటా డ్బ్భై మిలియన్ల టన్నుల ఉత్పత్తితో సింగరేణి సంస్థ పరిడవిల్లుతోంది. ఆంగ్లేయుల కాలంలో ఆవిర్భవించిన సింగరేణి నిజాం పరిపాలనలో కూడా కొనసాగింది. సింగరేణి సం స్థ 1870లో ఆవిర్భవించగా 1889లో బొగ్గు ఉత్పత్తి మొదలుపెట్టి ఆరు జిల్లాలలో విస్తరించింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న బొగ్గు నిక్షేపాలను వెలికితీస్తూ దేశ ప్రగతికి ప్రధాన ఇంధన వనరుగా మారి దక్షిణ భారతదేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందింది. సింగరేణిలో 1945 నుంచి కార్మిక సంఘాల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా 1998 నుంచి యూనియన్ గుర్తింపు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ సంస్ధలో ఇప్పటి వరకు ఆరు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. వీటిలో అత్యధికంగా సిసిఐ అనుబంధ కార్మిక సంఘం ఎఐటియుసి మూడుసార్లు, కాంగ్రెస్ అనుబంధ ఐఎఎన్‌టియుసి ఓసారి, బిఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రెండుసార్లు విజయం సాధించాయి. ఏడో పర్యాయం జరుగుతున్న ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు గుర్తింపు హోదా కోసం పోటీ పడుతున్నాయి.
2017లో చివరిసారిగా ఎన్నికలు
సింగరేణికి చివరగా 2017లో జరిగిన ఎన్నికలు జరిగాయి.తిరిగి 2021లో ఎన్నికలు జరగాల్సి ఉండగా అప్పట్లో కరోనా, ఇతర కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు. తిరిగి దశాబ్దం తరువాత మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను వాయిదా వేయాలని కొంతమంది హైకోర్టును ఆశ్రయించినప్పటికీ హైకోర్టు తీర్పు మేరకు ఈనెల 27న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 28నే ఎన్నికలు నిర్వహించే విధంగా సెప్టెంబర్ 27 షెడ్యూల్‌ను విడుదల చేసి నామినేషన్ల పక్రియను కూడా పూర్తి చేశారు. ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో సింగరేణి ఎన్నికలను వాయిదా వేశారు. కోర్టు అదేశంతో ఈనెల 27న ఎన్నికలు నిర్వహించేందుకు ఒకపక్క అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా కార్మిక సంఘాలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి.
1991కి ముందు లక్షా16 వేల మంది కార్మికులు
1889లో తొలుత ఇల్లెందులో బొగ్గు తవ్వకాన్ని ప్రారంభించిన ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణిలో 1991కి ముందు లక్షా16 వేల మంది కార్మికులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 39,832కి పడిపోయింది. ఇందులో కొత్తగా చేరిన దాదాపు 20 వేల మంది యువ ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం రెగ్యులర్ కార్మికులు, ఉద్యోగులు కలిపి 42 వేల మంది, మరో 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులు, మరో 60 వేల మందికిపైగా పెన్షన ఉ్లన్నారు. 27న జరిగే ఎన్నికల్లో మాత్రం అధికారులు కాకుండా దాదాపు 40 వేల మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. భూపాలపల్లి ఏరియాలో 5,350 ఓట్లు ఉండగా, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15,037 ఓట్లు ఉన్నాయి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్న మొత్తం 11 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క ఆసిఫాబాద్ మినహా మిగిలిన 10 స్థానాలను కాంగ్రెస్, మిత్రపక్షమైన సిపిఐ కైవసం చేసుకున్నాయి. దీంతో ఐఎన్‌టియుసి తమ సంఘం విజయం నల్లేరు మీద నడకేనని భావిస్తోంది. సింగరేణి ఎన్నికల్లో పట్టు సాధిస్తేనే రాజకీయంగా తమ ప్రాబల్యం కాపాడుకున్నట్టవుతుందని అటు అధికార, ఇటు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు భావిస్తూ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీని కోసం కోల్ బెల్ట్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సింగరేణిలో విజయం కోసం ముమర్మంగా ప్రయత్నాలను మొదలు పెట్టారు 2017లో జరిగిన సింగరేణి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘం గెలుపుకోసం కీలకంగా పనిచేసిన అప్పటి ఎంపి, ప్రస్తుత రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికే సింగరేణి ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన మరో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ రావు, వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖతో కలిసి ఆయన వ్యూహరచన ప్రారంభించారు. ఇప్పటికే ఆయన కార్యాచరణలోకి దిగారు. దీనిపై ఆదివారం ఆయన సింగరేణి ప్రాంత నేతలతో సమావేశం అయ్యారు. అయితే సింగరేణి కార్మికుల సంక్షేమం, మెరుగైన ప్రయోజనాలు తమ హయాంలోనే జరిగాయని జాతీయ కార్మిక సంఘాలైన ఎఐటియుసి, ఐఎన్‌టియుసి నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. గడిచిన పదేళ్ల కాలంలో కారుణ్య నియమాకాల వ్యవహారంలో మెడికల్ బోర్డు రూపకంగా భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున తమ యూనియన్‌ను గెలిపిస్తేనే సకల సమస్యలు పరిష్కారం అవుతాయని ఐఎన్‌టియుసి నాయకులు ప్రచారాన్ని కొనసాగిస్తుండగా. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అనుబంధ సంఘాన్ని ఎన్నుకుంటే కార్మికులకు మళ్లీ ఇబ్బందులు తప్పవని ఎఐటియుసి నాయకులు ధీటుగా ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి మిత్రపక్షాలుగా కోల్‌బెల్ట్‌లో పది ఎంఎల్‌ఎ సీట్లను సాధించిన కాంగ్రెస్, ఒక ఎంఎల్‌ఎ సీటును సాధించిన సిపిఐ ఈ ఎన్నికల్లో ప్రత్యర్థ్ధులుగా తలపడుతుండడం ఆసక్తిని రేపుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఎన్నికలివే కావడంతో ఆ పార్టీ ఎంఎల్‌ఎలు, మంత్రులకు ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News