కాబూల్: సెప్టెంబర్ 11(9/11) దాడుల 20వ వార్షికోత్సవంనాడే(ఈ నెల 11న) కాబూల్‌లోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌పై ప్రధాని మహ్మద్ హస్సన్ అఖుంద్ తమ అధికారిక జెండాను ఎగురవేశారని తాలిబన్ల సాంస్కృతిక కమిషన్ చీఫ్ అహ్మదుల్లా ముత్తాఖీ స్పష్టం చేశారు. అమెరికాపై అల్‌ఖైదా 20 ఏళ్ల క్రితం ఆత్మాహుతి వైమానిక దాడులకు పాల్పడిన ఘటనను గుర్తు చేసుకుంటూ ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సరీగ్గా అదేరోజున తాలిబన్లు తమ నూతన ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను జెండా ఎగురవేసి ప్రారంభించడం ప్రాధాన్యత కలిగి ఉన్నది. సెప్టెంబర్ 11 దాడులకు పాల్పడిన అల్‌ఖైదాకు ఆశ్రయమిచ్చిన కారణంగానే అఫ్ఘన్‌లోని అప్పటి తాలిబన్ ప్రభుత్వంపై అమెరికా యుద్ధం ప్రకటించింది. ఆ సమయంలో అమెరికా, దాని మిత్ర దేశాల దళాలు అఫ్ఘన్‌పై విరుచుకుపడి రెండు నెలల్లోనే(2001, డిసెంబర్ 7వరకల్లా) కాబూల్, కాందహార్‌లాంటి కీలక నగరాల నుంచి తాలిబన్లను తరిమికొట్టాయి. 20 ఏళ్ల తర్వాత పరిస్థితులు మళ్లీ మారిపోయాయి. ఆగస్టు 15న కాబూల్‌ను ఆక్రమించిన తాలిబన్లు మరోసారి అఫ్ఘనిస్థాన్‌కు పాలకులయ్యారు. అమెరికా తన దారినతాను వెనక్కి వెళ్లింది.