- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో రాగల మూడు రోజుల్లో పగటి ఉష్ణోగ్రత సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల అధికంగా నమోదు కాగలదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు(శుక్రవారం) కొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. సగటు సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ఈ రోజు బలహీనపడినట్లు తెలిపింది. నేడు తూర్పు విదర్భా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం సగటు మట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు పేర్కొంది.
- Advertisement -