మనతెలంగాణ/హైదరాబాద్ : టాస్క్‌ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఫోన్ ట్యాపిం గ్ కేసులో రాధాకిషన్‌రావును ఎ4గా పోలీసులు చే ర్చారు. రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో రాజకీయ పరమైన అంశాలను పొందుపర్చినట్లు సమాచారం. నాటి అధికార పార్టీ సుప్రీం, ఎస్‌ఐబి మా జీ చీఫ్ ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే ఫోన్లు ట్యా పింగ్ చేసినట్లు రాధాకిషన్‌రావు పేర్కొనట్లు రి మాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 2014లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 2016లో ఎస్‌ఐబి చీఫ్‌గా ప్రభాకర్‌రావును నియమించారని, ఆ తరువాత తన సామాజిక వర్గం వారందరిని ఏకం చేసి ఓ టీ మ్‌గా ఏర్పడ్డారని, నల్గొండ నుంచి ప్రణీత్‌రావు, రాచకొండ కమిషనరేట్ నుంచి భుజంగరావు, హై దరాబాద్ సిటి నుంచి తిరుపతన్న, సైబరాబాద్ నుంచి వేణుగోపాల్‌రావును ఎస్‌ఐబికి బదిలీ చే యించుకున్నారని, కీలకమైన టాస్క్‌ఫోర్స్ డిసిపి పోస్టులో నాటి అధికార పార్టీ సుప్రీం ఆదేశాలతో 2017లో తనను నియమించారని రాధాకిషన్‌రావు చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
శాఖా పరమైన వ్యవహారాలతో పాటు రాజకీయ ప రంగా నిఘా పెట్టేందుకు అతనికి ఆదేశాలు జారీ చేశారు. వీరు నలుగురూ తరుచూ కలుస్తూ బిఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేసినట్లు రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దీంతో పాటు వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న గట్టుమల్లును, ప్రభాకరావు ఆదేశాల మేరకు ఎస్‌ఐబికి బదిలీ చేశారు. వీరి కార్యకలాపాలను ఇతరులు గమనించకుండా అన్ని రకా ల జాగ్రత్తలు తీసుకునే వారని వెల్లడించారు. ముం దు జాగ్రత్త చర్యగా సోషల్ మీడియా యాప్స్ అ యిన వాట్సాప్, సిగ్నల్, స్నాప్‌చాట్‌లలో మాత్రమే తరచూ సంప్రతింపులు జరుపుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. రాధాకిషన్‌రావు తన సా మాజికవర్గాన్ని అడ్డుపెట్టుకుని, అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో సర్వీస్ 2020 ఆగష్టులో ముగిసినా, మరో మూడేళ్లు టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డిగా నే కొనసాగినట్లు పేర్కొన్నారు. మరోవైపు ప్రభాకర్‌రావు ప్రోద్బలంతోనే ఎస్‌ఐబిలోకి వచ్చిన ప్రణీత్‌రావు అతని అడుగుజాడల్లోనే నడిచాడని, ప్రభాకర్‌రావు ఐజి అయిన తర్వాత ఎస్‌ఐబిలో ప్రత్యేక ఎస్వోటీ బృందాన్ని ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు. వీరి ముఖ్య లక్ష్యం ప్రతిపక్ష నాయకులతో పాటు బిఆర్‌ఎస్ రెబల్స్ పై నిఘా పెట్టడమని తేల్చారు.
జనంలో పేరున్న నాయకులు, క్యాడర్ ఉన్న వారిని గుర్తించడమే లక్ష్యంగా పనిచేసినట్లు రాధాకిషన్‌రావు విచారణలో వెల్లడించారని రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు. ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్‌లోనూ పనిచేసేందుకు, ప్రభాకర్‌రావు వారికి అనుకూలంగా పనిచేసే వారిని నియమించుకున్నట్లు వెల్లడించారు. మాజీ అదనపు ఎస్‌పి వేణుగోపాల్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలు ఇతర అధికారులు ప్రభాకర్‌రావు బృందంలో ఉన్నట్లు వెల్లడించారు. బిఆర్‌ఎస్ మూడో సారి గెలుపొందేందుకు ప్రతిపక్ష నేతలు, వారి మద్దతుదారులు, కుటుంబసభ్యులు, వ్యాపారస్తులు, బిఆర్‌ఎస్ విమర్శకులతో పాటుగా గులాబీ పార్టీ నేతలు కూడా అధినేత నియంత్రణలోనే ఉండేలా ఈ బృందం నిఘా పెట్టిట్లు రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.
మరోవైపు ఎవరి నుంచి ఎంతెంత డబ్బు సీజ్ చేసిన వివరాలను వెల్లడించారు. భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్‌కు చెందిన రూ.70 లక్షలు సీజ్ చేసినట్లు అంగీకరించారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో రఘునందన్‌రావు, బంధువుల నుంచి కోటి రూపాయలు సీజ్ చేసినట్లు వెల్లడించారు. అలాగే మునుగోడు ఉపఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన రూ.3.50 కోట్లు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. కొందరు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాధాకిషన్ రావును 10 రోజులు కస్టడీ ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. స్వీకరించిన నాంపల్లి కోర్టు రాధాకిషన్‌రావు న్యాయవాదికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. టెలిగ్రాఫ్ యాక్ట్ మెమోను సైతం పోలీసులు దాఖలు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రణీత్‌రావ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ స్వీకరించిన కోర్టు తిరిగి మంగళవారానికి వాయిదా వేసింది. రాధాకిషన్‌రావు విచారించిన తర్వాత రాజకీయ నేతలకు నోటీసులు ఇవ్వడానికి దర్యాపు బృందం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కస్టడీ తీసుకున్న భుజంగరావు, తిరుపతన్న లను నాలుగో రోజు విచారించారు.
ఈ విచారణలో పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ నాయకుల ఫోన్లపై నిఘా పెట్టి ప్రణిత్‌రావు ఆ సమాచారాన్ని రాధాకిషన్‌రావుకి అందజేసినట్లు పోలీసులు గుర్తించారు. అదే సమయంలో పోలీ సు వాహనాల్లో పెద్దఎత్తున నిధులు తరలిచినట్లు ఫోన్ ట్యాపింగ్ నిందితులు అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవ హారంపై విచారణ జరుపుతున్న సమయంలో హవాలా ఉందంతం వెలుగులోకి వచ్చిన సంగతి విదితమే. ప్రణీత్‌రావు ముఠా అటు ప్రజాప్రతి నిధుల ఫోన్లతోపాటు, ఇటు పలువురు హవాలా వ్యాపారుల, ప్రముఖ వ్యాపారుల ఫోన్లపై కూడా నిఘా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. శాస నసభ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీల నాయకులు, సహచరులు, మద్దతుదారుల ఫోన్లపై నిఘా పెట్టి, వారు తరలిస్తున్న డబ్బును పట్టుకున్న ట్లు పోలీసులు అనుమానించారు. ట్యాపింగ్ దర్యాప్తులో భాగంగా నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించినప్పుడు వారు కూడా ఈ ఆరోప ణలను అంగీకరించినట్లు సమాచారం. ప్రణీత్‌రావు ఫోన్లపై నిఘా ఉంచగా వారిచ్చిన సమాచారం ఆధారంగా టాస్క్‌ఫోర్స్ డిసిపిగా పని చేసిన రాధాకిషన్‌రావు క్షేత్రస్థాయిలో పంపిణీ అవుతున్న డబ్బు పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది.
ఇదే సమయం లో ఎంఎల్‌ఎ అభ్యర్థులకు నగదు పంపిణీలో మరొక అధికారి కీలకంగా వ్యవహరించినట్ల సమాచారం. పోలీసు వాహనాల్లోనే పకడ్బం దీగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాలకు నిధులు రవాణా చేసి అందజేశారని గుర్తించారు. విచారణ సందర్భంగా ఎవరెవరికి డబ్బు అందజే శామనే సమాచారం కూడా చెప్పినట్లు సమాచారం. దాంతో వీరు చెప్పిన విషయాలు నిర్ధారించుకునేం దుకు డబ్బు అందుకున్నారని భావిస్తున్న వారందరికీ నోటీసులు ఇచ్చేందుకు దర్యాప్తు బృందం సిద్దంగా ఉన్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులు అనుమతిస్తే రెండు, మూడు రోజుల్లోనే నోటీ సుల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు రాధాకిషన్ రావు కస్టడీ కోరుతూ పోలీసులు, నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో వెల్లడించిన సమాచారం ఆధారంగా నాటి అధికార పార్టీ సుప్రీంకు ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాపింగ్‌కు సంబఃదించిన అంశాలను నివేదించినట్టు కూడా పోలీసులు తేల్చారు. ఈ మొత్తం వ్యవహారంలో నాటి అధికార పార్టీ సుప్రీమ్ ఆదేశాల మేరకు వీరంతా నడిపించి, ప్రతిపక్షాలను దెబ్బతియ్యటం, బిఆర్‌ఎస్‌కు అన్ని రకాలుగా సహకారం అందిస్తూ, మూడవ సారి అధికారం లక్ష్యంగా పనిచేసినట్టు పోలీసులు అభిప్రాయపడ్డారు.
తెరపైకి మరో సీనియర్ అధికారి పేరు!
ఈ కేసులో తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన మరో సీనియర్ అధికారి దయాకర్ రెడ్డి పేరు తెర పైకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎ1 ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు ఈ అధికారి సన్నిహితుడిగా తెలుస్తోంది. దయాకర్ రెడ్డి సుదీర ్ఘకాలంగా ఎస్‌ఐబిలో పనిచేశారు. ఈ కేసులో దయాకర్ రెడ్డి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయనతో పాటు ఓ ఇన్‌స్పెక్టర్‌కు స్పెషల్ టీం నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే మాజీ డిఎస్‌పి ప్రణీత్ రావు, అదనపు ఎస్‌పిలు భుజంగరావు, తిరుపతన్నలను అరెస్టు చేశారు. వీరి విచారణ కొనసాగుతోంది.
తూచ్… నేను ఇండియాకు రావట్లేదు : ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎ1గా ఉన్న ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సోమవారం యూఎస్ నుంచి వస్తారని, కేసులో అప్రూవర్‌గా మారుతారంటూ వార్తలొచ్చాయి. అవన్ని ఒట్టి పుకార్లేనని సమాచారం. ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికాలో క్యాన్సర్‌కు చికిత్స తీసకుంటున్నారు. అయితే, ట్రీట్‌మెంట్ ఇంకా మరో మూడు నెలల పాటు అక్కడే ఉండనున్నట్లు సమాచారం. అదే విషయాన్ని రాష్ట్రంలోని పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పరిశోధనలో భాగంగా ప్రభాకర్ రావు నివాసంలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. అయనను అదుపులోకి తీసుకుని విచారిస్తే గానీ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫొన్లు ట్యాపింగ్ చేసి ప్రైవేటు వ్యక్తులతో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు బెదిరింపులు, దారుణాలకు ఒడిగట్టినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.