Wednesday, January 22, 2025

అసెంబ్లీలో బహుజనులు కూర్చునే రోజులు రాబోతున్నాయి: ఆర్‌ఎస్. ప్రవీణ్‌ కుమార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర అసెంబ్లీలో బహుజనులు కూర్చునే రోజులు రాబోతున్నాయని బహుజన సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని చర్చి కాంపౌండ్ లో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఇక్కడి అసైన్డ్ భూములు.. 500 ఎకరాలు భూముల కుంభకోణం వెనుక ఏనుగు రవీందర్ ఉన్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే అభ్యర్థులు మద్యం పంచి ఓట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. మన పిల్లలు అమెరికా వెళ్లి ఎందుకు చదువుకోవడం లేదన్నారు. బిజెపి మాదిగ, మాలల మీద మొసలి కన్నీరు కారుస్తోందని ఎద్దేవా చేశారు. నిరంతరం మీ మధ్యలో ఉండే బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News