Saturday, November 23, 2024

ఇక ఆకాశ ప్రయాణాల రోజులు

- Advertisement -
- Advertisement -
Days To Avail Air Taxis Are Not Far
ఎయిర్‌టాక్సీలకు రెక్కలు: సింధియా సవ్వడి

న్యూఢిల్లీ: దేశంలో గగనయానం మరింత విస్తరించేందుకు రంగం సిద్ధం అవుతోంది. రాబోయే రోజులలో ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి వస్తాయి, దీనితో ప్రధాన రాదార్లు బదులుగా ఎయిర్‌టాక్సీలలో ఆకాశమార్గంలో మజిలీ చేరుకునే వీలేర్పడుతుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం తెలిపారు. ఎయిర్‌టాక్సీల నిర్వహణ డ్రోన్లకు వర్తించే నిబంధనల పరిధిలోనే ఉంటుందని వివరించారు. నేలపై ప్రధాన రాదార్లు వాహనాలతో కిక్కిరిసి పోవడం , ట్రాఫిక్ జాంలు, కాలుష్యం వంటి పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎయిర్‌టాక్సీల నిర్వహణపై పరిశోధనలు సాగుతున్నాయి. పలు దేశాలలో వీటిని ఆవిష్కరిస్తున్నారు.

ఇక్కడ కూడా సంబంధిత అంశంపై స్టార్టప్‌లు వస్తున్నాయని మంత్రి విలేకరుల సమావేశంలో తెలిపారు. దేశంలో ఎయిర్‌టాక్సీల రాక రోజు మరెంతో దూరంలో లేదని , ఇప్పుడు రోడ్లపై యుబెర్ , వోలా వంటి వాటి మాదిరిగానే త్వరలోనే గాలిలో కూడా టాక్సీలు అందుబాటులోకి వస్తాయని,దీనితో గమ్యస్థానాలు చేరుకోవడం తేలిక అంతకు మించి వేగవంతం అవుతాయని వివరించారు. ఇక నియమనిబంధనలు నిర్ధేశించుకోవడం కీలక అంశం అని, అయితే వీటికి కూడా డ్రోన్లకు ఉండే రూల్స్ వర్తించే అవకాశం ఉందన్నారు. త్వరలోనే గాలిలో ప్రయాణాలు అసాధ్యం కాకపోవచ్చునని తెలిపారు. ఇక అక్రమపు డ్రోన్ల టెక్నాలజీని ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా అధ్యయనాలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రక్షణ, హోం మంత్రితశాఖలు, పౌర వైమానిక భద్రతల సంస్థ బిసిఎఎస్‌తో కలిసి సరైన టెక్నాలజీని రూపొందించే పని జరుగుతోందని, దీనిని వినియోగంలోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News