Sunday, January 19, 2025

రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు

- Advertisement -
- Advertisement -

Daytime temperatures rise by two to four degrees

పలు జిల్లాల్లో అక్కడక్కడా వడగాడ్పులు వీచే అవకాశం
హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ

హైదరాబాద్: రానున్న రెండు రోజులు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధ, గురు వారాల్లో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతోపాటు రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడొచ్చని అధికారులు తెలిపారు. ఉపరితల ద్రోణి తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు, సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News