Wednesday, January 22, 2025

తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

Daytime temperatures rose in Telugu states

రెండు రాష్ట్రాల్లోనూ భానుడి భగభగ
అవసరమయితేనే జనాలు బయటకు రావాలి
తెలుగు -రాష్ట్రాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్‌ల జారీ
ఈనెల రెండోవారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి
వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్: ఇళ్ల నుంచి బయటకు వెళ్తున్నారా అయితే జాగ్రత్త ? ఎందుకంటే ఎపి, తెలంగాణ ప్రజలంతా ఎండలకు జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం భారీగా పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో తెలుగు-రాష్ట్రాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్‌ల జారీ చేసినట్టు వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటికి రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఎపి, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం భానుడు భగభగ మండిపోతున్నాడు. ఉదయం ఏడు గంటలకే నిప్పులు కక్కుతున్నాడు. ఎండలకు తోడు, వడగాల్పులు కూడా ఊహించని స్థాయిలో ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ఈ నెల రెండోవారంలో ఎండలు మరింత పెరుగుతాయని, రాత్రుళ్లు సైతం గరిష్ట ఉష్ణోగ్రతలు మోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఎపి, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రామగుండంలో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో 41 నుంచి 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత మోదవుతుండటంతో నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటుతున్నాయ్. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అయితే ఉడికిపోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News