హైదరాబాద్: జిహెచ్ఎంసి లో పలువురు జోనల్ కమిషనర్, డీసీలు బదిలీలు జరిగాయి. శేరి లింగంపల్లి జోనల్ కమిషనర్ గా శ్రీనివాస్ రెడ్డి బదిలీ అయ్యారు. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ గా రవి కిరణ్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య ను ఎలక్షన్స్ అడిషనల్ కమిషనర్ గా బదిలీ చేశారు. శేరిలింగంపల్లి డిప్యూటి కమిషనర్ గా పనిచేస్తున్న టి వెంకన్నను చార్మినార్ జోనల్ కమిషనర్ గా బదిలీ చేశారు. జిహెచ్ఎంసి శానిటేషన్ అడిషనల్ కమిషనర్ గా ఉపేందర్ రెడ్డిని బదిలీ చేశారు. చార్మినార్ జోనల్ కమిషనర్ గా ఉన్న అశోక్ సామ్రాట్ ను జాయింట్ డైరెక్టర్ సిడిఎఎంకు బదిలీ చేశారు. చందానగర్ డిప్యూటీ కమిషనర్ సుధాంశుకు శేరిలింగంపల్లి సర్కిల్ డిసిగా బదిలీ చేయడంతో చందానగర్ సర్కిల్ డిసిగా పూర్తిగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.
Also Read: నా ట్వీట్‌కు వివరణ ఇవ్వను… ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం: జితేందర్