Monday, December 23, 2024

వార్నర్ ఒంటరి పోరాటం..

- Advertisement -
- Advertisement -

క్లిష్టమైన లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ పృథ్వీషా ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఫిలిప్ సాల్ట్ (3) కూడా నిరాశ పరిచాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన స్టార్ బ్యాటర్ రిలి రొసొ కూడా విఫలమయ్యారు. రొసొ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కెప్టెన్ డేవిడ్ వార్నర్ తనపై వేసుకున్నాడు. అతనికి యశ్ ధూల్ (13), అక్షర్ పటేల్ (15) అండగా నిలిచారు. ఒంటరి పోరాటం చేసిన వార్నర్ 58 బంతుల్లోనే ఐదు సిక్సర్లు, ఏడు బౌండరీలతో 86 పరుగులు చేశాడు. అయితే మిగతావారు విఫలం కావడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News