Saturday, December 21, 2024

ఇన్సులిన్‌తో చౌకబేరం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మధుమేహ రోగులు వినియోగించే ఇన్సులిన్‌ను అడ్డదారిలో సేకరించి, భారీ డి స్కౌంట్లకు విక్రయిస్తున్న ముఠా లను తెలంగణ పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సం యుక్తంగా గుర్తించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వ హించి, అక్రమ నిల్వలను గుర్తించారు. తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డిసిఎ) అధికారులు జరిపిన దా డుల్లో హైదరాబాద్‌లోని ఆరుగురు హోల్‌సేల్ వ్యాపారుల పై దాడులు నిర్వహించి లక్షల రూపాయల విలువైన ఇన్సులిన్ నిల్వలను స్వాధీనం చే సుకున్నారు. ఈ ఇన్సులిన్‌ను ఎలాంటి కొనుగోలు బిల్లులు లేకుండా న్యూఢిల్లీ నుండి అక్రమంగా సేకరించారు. డిసిఎ దాడుల్లో భారీ మొత్తంలో ’ఇన్సులిన్’ ఇంజెక్షన్లతో పాటు ప్రీ-ఫిల్ పెన్నుల్ని గుర్తించారు. ఎలాంటి బిల్లులు లేకుండా తక్కువ ధరలకు న్యూఢిల్లీ నుండి సేకరించిన ఇన్సులిన్ ఇంజెక్షన్‌లను హైదరా బాద్‌కు చెందిన పలువురు టోకు వ్యాపారులు 40% కంటే తగ్గింపుతో విక్రయిస్తున్నారు.

నగరంలోని రిటైల్ విక్రేతలతో నెట్‌వర్క్ ఏర్పాటు చేసు కుని భారీగా ఈ ఔషధాలను యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. రిటైల్ మార్కెట్ ధరలకంటే తగ్గింపు ధరలతో ఈ ఔషధాల విక్రయాలు జరగడంపై పక్కా సమాచారం అందడంతో సోదాలు నిర్వహించారు. ఈ ఔషధాలు అసలైనవా కాదో నిర్ధారించాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.ఇన్సులిన్ తయారీ, నాణ్యత, ప్రామాణికతపై అధికారులు సందేహం వ్యక్తపరుస్తున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడుల్లో రూ.51.92 లక్షల విలువైన ఇన్సులిన్ పట్టుబడింది. హోల్‌సేల్ వ్యాపారులు 40% కంటే ఎక్కువ రాయితీలతో మార్కెట్‌లో చలామణిలో ఉన్న ప్రముఖ బ్రాండ్ల ’ఇన్సులిన్’ ఇంజెక్షన్లను సేకరించారు. ముందే ఇన్సులిన్ నింపిన పెన్నులు అధికంగా ఉన్నాయి. దాడుల్లో పట్టుబడిన ఇన్సులిన్ తయారీ, నాణ్యతపై పరీక్షలు జరుపనున్నారు. డిస్కౌంట్లకు ఆశపడి నకిలీ ఔషధాలను కొనుగోలు చేయొద్దని, మందుల ప్రామాణికత నిర్ధారించుకోవాని, ఈ విషయంలో వైద్యులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News