Sunday, January 19, 2025

కోమటిరెడ్డి రాజకీయాలతో నాకు నిద్రపట్టడం లేదు: డిసిసి అధ్యక్షుడు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఇబ్బందులు ఉన్నాయని డిసిసి అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. డిసిసి అధ్యక్షుడు అనిల్ ఆధ్వర్యంలో భువనగిరిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడారు. అందుకే కార్యకర్తల సమావేశం నిర్వహించామన్నారు. కాంగ్రెస్ నుంచి ఇప్పటికిప్పుడు మారనని, కోమటి రెడ్డి అంశాన్ని కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని అనిల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పెద్దల స్పందన బట్టి ఆలోచన చేస్తానని, డిసిసి అధ్యక్షుడిగా చురుకైన ప్రాత పోషిస్తున్నానని, నిత్యం ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతున్నామన్నారు. జిల్లాలో పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయనుకున్నామని, కానీ ఎన్నికల వేళ స్థానిక ఎంపి గ్రూపులు పోత్సహించడం సరికాదని దుయ్యబట్టారు. ఘట్‌కేసర్‌లో ఎంపి కోమటి రెడ్డి రహస్య సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారని అనిల్ నిలదీశారు. వర్గాలుగా విభజిస్తూ భువనగిరిలో పార్టీని ఎంపి విచ్ఛినం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎంపిగా గెలిపిస్తే నియోజకవర్గంలో చిచ్చుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో భువనగిరిలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఎంపి కృషి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంపి వేర్పాటు ధోరణి వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని అనిల్  తన బాధను వ్యక్తం చేశారు.

Also Read: భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News