Tuesday, November 5, 2024

పిల్లలపై కొవాగ్జిన్ ప్రయోగం: డిసిజిఐ ఆమోదం

- Advertisement -
- Advertisement -

DCGI approved Covaxin clinical trials

న్యూఢిల్లీ : చిన్నపిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటు లోకి తీసుకురాడానికి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ తో క్లినికల్ ప్రయోగాలు జరిపేందుకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అనుమతి మంజూరు చేసింది. 218 ఏళ్ల చిన్నపిల్లలపై ఈ టీకా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోడానికి రెండు, మూడు దశల ప్రయోగాలు నిర్వహించాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై డిసిజిఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వయసు పిల్లలు 525 మందిపై భారత్ బయోటెక్ ప్రయోగాలు చేస్తుంది. మూడోదశ ప్రయోగాలు ప్రారంభించడానికి ముందే రెండోదశ క్లినికల్ ట్రయల్స్ భద్రత డేటా, డిసిఎంబి సిఫార్సులను సిడిఎస్‌సిఒకు సమర్పించాలని భారత్ బయోటెక్‌కు డిసిజిఐ సూచించింది. ఢిల్లీ, పాట్నా ఎయిమ్స్‌లతోపాటు దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఈ ప్రయోగాలు జరగనున్నాయి. వాలంటీర్లకు 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇచ్చి ఫలితాలు విశ్లేషిస్తారు.

DCGI approved Covaxin clinical trials

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News