న్యూఢిల్లీ: కరోనా సోకిన వారికి అత్యవసర వినియోగానికి మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. డిఆర్ డివొ అభివృద్ధి చేసిన 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2-డిజి) ఔషధానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అనుమతిచ్చింది. కరోనా చికిత్స వినియోగానికి అనుమతించినట్టు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ఔషధాన్ని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డిఆర్ డివొ ల్యాబ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ అభివృద్ధి చేసింది. కరోనా రోగులు వేగంగా కోలుకునేందుకు ఉపకరిస్తుందని క్లినికల్ ట్రయల్స్ లో వెల్లడైందని, రోగులకు ఆక్సిజన్ అవసరాన్ని తగ్గిస్తుందని పరిశోధనలో తేలిందని అధికారులు తెలిపారు. 2డిజి చికిత్స పొందినవారిలో ఎక్కువ మందికి ఆర్టీపిసిఆర్ లో నెగెటివ్ వచ్చినట్టు డీఆర్టీవో వెల్లడించింది. 2డిజి ఔషధం పొడి రూపంలో అందుబాటులోకి రానుందని, పొడి నీటిలో కరిగించి నీటి ద్వారా తీసుకోవచ్చని డీఆర్టీవో అధికారులు తెలిపారు.
DCGI gives approval to use 2-DG