Sunday, December 22, 2024

ఆటోను ఢీకొన్న డిసిఎం: ముగ్గురు మృతి.. పరారైన డ్రైవర్

- Advertisement -
- Advertisement -

బోధన్: నిజామాబాద్ శివారులో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన డిసిఎం అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బోధన్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలి నుంచి డిసిఎం డ్రైవర్ పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News