Friday, December 20, 2024

ఆర్ టిసి బస్సును ఢీకొట్టిన డిసిఎం

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని వరంగల్‌ఖమ్మం జాతీయ రహదారిపై వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టిసి బస్సును వెనుక నుంచి డిసిఎం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ సంఘటనలో డీసీఎం డ్రైవర్ మృతదిచెందగా అందులో ప్రయాణిస్తున్న నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.

ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. అయితే డిసిఎం డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎస్సై మంగ, సిఐ సదన్‌కుమార్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వాహనంలో నుంచి బయటకు తీసి 108 ద్వారా వరంగల్ ఎంజిఎంకు తరలించారు. కాగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News