- Advertisement -
హైదరాబాద్: హబ్సిగూడలోని మెట్రో స్టేషన్ కింద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డిసిఎం ముందున్న ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డిసిఎం డ్రైవర్ తీవ్రంగా గాయపడడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశాయి. క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: ట్రెండింగ్‌లో పాలమూరు ప్రాజెక్టు టాప్
- Advertisement -