Sunday, January 5, 2025

బాలుడిది నరబలి కాదు.. ఆర్థిక పరమైన హత్య: డిసిపి శ్రీనివాస్ రావు

- Advertisement -
- Advertisement -

సనత్‌నగర్: హైదరాబాద్ సనత్ నగర్ లోని అల్లాదున్ కోఠి ఏరియాలో దారుణం జరిగింది. ఓ ఎనిమిదేళ్ల బాలుడిని ఓ హిజ్రా కిరాతకంగా హత్యచేశాడు. తమ కొడుకును నరబలి ఇచ్చారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై డిసిపి శ్రీనివాస్ రావు స్పందించారు. బాలుడిని ఇమ్రాన్ హత్య చేసి నాలాలో పడేశారని తెలిపారు.

బాలుడిది నరబలి కాదు.. ఆర్థిక పరమైన హత్య అన్నారు. ఇమ్రాన్ ఇంటికి బాలుడు ఆడుకోవడానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే బాలుడిని ఇంట్లో చంపేసి.. బకెట్ లో కుక్కారని ఆయన తెలిపారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని గోనె సంచిలో నాలాకి తీసుకెళ్లి పడేశారని డిసిపి వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించామని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నామని డిసిపి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News