Wednesday, January 22, 2025

రాజ్యసభకు డిసిడబ్ల్యు చైర్‌పర్సన్ స్వాతి మాలివాల్

- Advertisement -
- Advertisement -

నామినేట్ చేసిన ఆప్

న్యూఢిల్లీ: ఈనెల 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం ఢిఆల్లీ మహిళా కమిషన్(డిసిడబ్ల్యు) చైర్‌పర్సన్ స్వాతి మాలివాల్‌ను పార్టీ అధ్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నామినేట్ చేసింది. ఆమెతోపాటు ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న సంజయ్ సింగ్, ఎన్‌డి గుప్తాలను కూడా మరో పర్యాయం ఆప్ నామినేట్ చేసినట్లు పార్టీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. కాగా, ఈ ముగ్గురి పేర్లను ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ(పిఎసి) ప్రకటించింది. డిసిడబ్లు చైర్‌పర్సన్ స్వాతి మాలివాల్‌ను ఆప్ తొలిసారి రాజ్యసభకు నామినేట్ చేసింది.

సంజయ్ సింగ్, ఎన్‌డి గుప్తాలను రాజ్యసభ సభ్యులుగా రెండవ పర్యాయం కొనసాగించాలని పిఎసి నిర్ణయించింది. రాజ్యసబ సభ్యుడు సుశీల్ కుమార్ గుప్తా పదవీ కాలం ఈ నెలలో ముగియనున్నది. ఆయన హర్యానాలో ఎన్నికల రాజకీయాలలో దిగాలని నిర్ణయించుకోవడంతో ఆయన స్థానం ఖాళీ అవుతోంది. ఆ స్థానంలో స్వాతి మాలివాల్‌ను పిఎసి నామినేట్ చేసింది. ఈ ఏడాది చివరిలో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి హర్యానాలో పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆప్ ఆశిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News