Tuesday, November 5, 2024

ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్‌కూ తప్పని పాట్లు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీలో మహిళలకు భద్రత ఉందా? అక్కడ పోలీసులు సరిగా పనిచేస్తారా? అని అనుమానం కలుగుతోంది. కొన్ని రోజుల క్రితం 20 ఏళ్ల అంజలిని కారుతో ఢీకొట్టి కొన్ని కిలో మీటర్ల వరకు లాక్కెళ్లి ఆమె చావుకు కారణమైన ఘటన మరువక ముందే మరో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఈసారి ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్‌కే చేదు అనుభవం తప్పలేదు. బుధవారం రాత్రి ఆమె మహిళా రక్షణపై పరిశీలన చేస్తుండగా ఈ చేదనుభవం ఎదురయింది. ఎయిమ్స్ 2వ గేటు వద్ద ఆమె నిల్చుని ఉండింది. ఆ ప్రాంతం కోట్లా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఆమె కథనం ప్రకారం ఆమె ఫుట్‌పాత్‌పై నిల్చుని ఉండగా, ఓ తెల్ల కారు ఆమె వద్దకు వచ్చి ఆగింది.

‘లిఫ్ట్ ఇస్తా దా…’ అని ఆమెతో ఆ కారు డ్రయివర్ అన్నాడు. పదేపదే కారులో వచ్చి కూర్చో అన్నాడు. ఎప్పుడైతే ఆమె చిర్రెతి అతడిని మందలించడానికి కారు కిటికీ వైపుకు వెళ్లగానే అతడు కారు అద్దాలు పైకి లేపేశాడు. దాంతో ఆమె చేయి అందులో ఇరుక్కుపోయింది. ఆ తర్వాత ఆమెను దాదాపు 10 నుంచి 15 మీటర్ల వరకు లాక్కెళ్లాడు. ఈ విషయాన్ని స్వయంగా డిసిపి చందన్ చౌదరి తెలిపారు. తెల్లవారు జామున 2.45 గంటలకు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి పేరు హరీశ్ చంద్ర అని, అతడు సంఘం విహార్‌కు చెందిన వ్యక్తి అని, అతడు బాగా తాగి ఆమె దగ్గరికి వెళ్లాడని చౌదరి వివరించారు.
పోలీసులకు పిసిఆర్ కాల్ తెల్లవారు జామున 3.12 గంటలకు అందింది. ఎసిపి హౌస్ ఖాస్ సహా పోలీసు బృందం 3.20కి ఆ ప్రాంతానికి చేరుకుంది. నిందితుడిని పట్టుకున్నారు. ‘మాలివాల్ నుంచి రాతపూర్వక ఫిర్యాదును తీసుకుని నిందితుడిని వైద్య పరీక్షకు పంపాం’ అని డిసిపి తెలిపారు. ఐపిసి సెక్షన్ 354, ఇంకా 323, 341, 509 ఐపిసి, మోటార్ వాహన చట్టం 185 కింద నిందితుడిపై కేసు మోపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News