- Advertisement -
కన్నౌజ్: ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ నగరంలోని కాళీ నది, గంగా నది సంగమం వద్ద వీధి కుక్కలు, పశువుల మృత కళేబరాలు కొట్టుకుపోతున్నాయని ఓ ప్రభుత్వ అధికారి శనివారం తెలిపారు. కాళీ నది, గంగానది సంగమం వద్ద శుక్రవారం 37 పశువుల మృత కళేబరాలు కొట్టుకురావడంపై కన్నౌజ్ జిల్లా మెజిస్ట్రేట్ రాకేశ్ కుమార్ మిశ్రా నివేదికను కోరారు. అలా కొట్టుకొచ్చిన పశువుల మృత కళేబరాల్లో 20 బర్రెలు కాగా, మిగతా 17 ఆవులవి అని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఎలాంటి పశువు చనిపోలేదని సదా సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ ఉమాకాంత్ తివారీ తెలిపారు. కాకపోతే నదిలో కొట్టుకొచ్చిన పశువులు పొరుగు జిల్లావై ఉండొచ్చని ఆయన తెలిపారు. అయితే నదిలోంచి పశువుల మృతకళేబరాలను జెసిబిల ద్వారా తొలగించినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా పశువుల మరణాలపై దర్యాప్తు చేపడుతున్నట్లు కూడా ఆయన తెలిపారు.
- Advertisement -