Wednesday, January 22, 2025

భువనగిరి చెరువులో మృతదేహం లభ్యం….

- Advertisement -
- Advertisement -

రాయిగీరు చెరువులో మరో మృతదేహం లభ్యం

వారం రోజుల వ్యవధిలో ఒక్కే చెరువులో రెండు మృతదేహాలు లభ్యం
భయాందోళనలతో స్థానిక ప్రజలు, దర్యాప్తు చేస్తున్న భువనగిరి రూరల్ పోలీసులు

మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భువనగిరి మున్సిపల్ పట్టణ శివారులోని రాయిగీరు చెరువులో గత వారం రోజుల్లో రెండు మృతదేహాలు లభించడం తీవ్ర కలకలం రేపాయి. బుధవారం రాయిగీరు చెరువులో ఓ పురుషుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. కాగా గత శనివారం రోజున ఇదే చెరువులో 45 సంవత్సరాల వయసు కలిగిన ఓ పురుషుడి మృతదేహం స్థానికులకు కనిపించింది. ఐతే గత నాలుగు ఐదు రోజుల్లోనే రెండు మృతదేహాలు ఒకే చెరువులో లభ్యం కావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఆ మృతదేహాలు ఎవరివి? ఎవరన్నా హత్య చేసి ఇక్కడ పాడేశారా? లేకా వారే ఆత్మహత్యలు చేసుకున్నారా..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చెరువులో మృతదేహాలను చూసి స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం తెలుసుకున్న భువనగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News