Sunday, January 19, 2025

మణికొండలో కారులో మృతదేహం… హత్యా? ఆత్మహత్యా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కారులో మృతదేహం కనిపించిన సంఘటన రంగారెడ్డి జిల్లా మణికొండలో జరిగింది. కారులో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారు వెనుక సీట్లో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న మృతదేహం ఎవరిది?… హత్య చేశారా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారు నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సిసి టివి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. శనివారం టిఎస్ 07జెవి2826 అనే నంబర్ గల కారుపై వనస్తలిపురంలో రోడ్డుపై నిలపడంతో రూ.235 ఫైన్ ఆ వాహనంపై ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News