Tuesday, January 21, 2025

వైసిపి ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం కలకలం..

- Advertisement -
- Advertisement -

అమరావతి: కాకినాడ వైసిపి ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో మృతదేహం కలకలం సృష్టించింది. నిన్న ఉదయం తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంతో కారులో ఎమ్మెల్సీ ఉదయ్ బాబు బయటికి వెళ్లారు.సుబ్రహ్మణ్యంకు యాక్సిడెంట్ అయిందని అర్థరాత్రి అతని తమ్ముడికి ఎమ్మెల్సీ ఉదయ్ బాబు సమాచారం ఇచ్చాడు. తెల్లవారుజామున 2గంటలకు డ్రైవర్ మృతదేహాన్ని ఉదయ్ బాబు తన కారులో అతని తల్లిదండ్రులు పనిచేస్తున్న అపార్ట్ మెంట్ వద్దకు తీసుకొచ్చాడు. డ్రైవర్ మృతదేహాన్ని కిందకి దించాలని ఉదయ్ బాబు అతని తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే, వారు మృతదేహాన్ని కిందకు దించేందుకు నిరాకరించారు. అసలు ఏం జరిగిందని డ్రైవర్  తల్లిదండ్రులు ప్రశ్నించగా, వారికి సమాధానం చెప్పకుండా ఆగ్రహం వ్యక్త చేస్తూ.. కారును అక్కడే వదలి, మరో కారులో వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు.. ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా అక్కడికి భారీగా చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Dead body found in Kakinada YCP MLC’s Car

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News