Tuesday, January 21, 2025

ఎస్‌విఎంటి రైల్వే స్టేషన్‌లో డ్రమ్ములో మహిళా మృతదేహం…….

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: మహిళా మృతదేహం డ్రమ్ములో కనిపించిన సంఘటన కర్నాటక రాష్ట్రం ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ రైల్వేస్టేషన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. డ్రమ్ములో మహిళా మృతదేహం కనిపించడంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌పి సౌమ్య లతా తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. గత సంవత్సరం డిసెంబర్‌లో ఎస్‌ఎంవిటి రైల్వే స్టేషన్‌లో పసుపు రంగు గన్నీ బ్యాగ్ నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు ప్రయాణికులు సమాచారం ఇచ్చారు. గన్నీ బ్యాగ్ ఓపెన్ చేయగా మహిళా మృతదేహం కనిపించింది.
జనవరి 4 న ఎస్‌విఎంటి రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ 1 దగ్గర బ్లూ కలర్ ప్లాస్టిక్ డ్రమ్ములో మృతదేహం కనిపించింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్లాస్టిక్ డ్రమ్ము ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం నుంచి ఎస్‌విఎంటి రైల్వే స్టేషన్‌కు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News