Wednesday, January 22, 2025

వాటర్ ట్యాంక్‌లో మృతదేహం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నల్గొండ రూరల్: నల్గొం డ మున్సిపాలిటీ పరిధి, 11వ వార్డు పాతబస్తీ హిందూపూర్‌లోని వాటర్ ట్యాంక్‌లో శవం లభించడం కలకలం రేపుతోంది. ప ది రోజుల క్రితం వాటర్ ట్యాంక్‌లో పడి ఒ కరు మృతి చెందినట్లు పోలీసులు, ప్రజలు అనుమానిస్తున్నారు. అప్పటినుంచి ట్యాం కు నుంచి వచ్చే మంచినీళ్లనే పాతబస్తీ, హిందుపూర్‌తో పాటు పలు కాలనీలకు చెందిన ప్రజలు నిత్యం తాగుతుండడం గ మన్హారం. పోలీసుల కథనం ప్రకారం.. పా తబస్తీ హనుమాన్ నగర్‌కు చెందిన ఆవుల వంశీకి చెందిన వంశీకృష్ణయాదవ్ (26)కు అనారోగ్య సమస్యలతో పాటు మానసిక స్థితి కూడా సరిగ్గా లేదు. గత 24వ తేదీన రాత్రి సమయం నుంచి వంశీకృష్ణ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు స్థానిక వ న్‌టౌన్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాటి నుంచి కనిపించకుండాపోయిన వం శీ అదేరోజు రాత్రి సమయంలో హిందూపూర్ వాటర్ ట్యాంకులో దూకి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అ యితే కొద్ది రోజుల నుంచి ట్యాంకు నుంచి వస్తున్న మంచినీళ్లు తాగునీరు తేడా ఉండడంతో 11వ వార్డు ప్రజలు వాటర్ సప్లై సి బ్బందిపై ఫైర్ కావడంతో మున్సిపల్ సి బ్బంది, స్థానికులు ట్యాంకులో వాటర్‌ను చెక్ చేస్తున్న సమయంలో ట్యాంక్‌లో వంశీకృష్ణ మృతదేహం లభ్యమైంది. రోజుల తరబడి మంచినీటి ట్యాంకులను చెక్ చేయడంలో నిర్లక్షం వహిస్తున్నారంటూ స్థాని కులు మండిపడ్డారు. నీళ్లను అందించే విషయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆ డుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇ టీవల నాగార్జునసాగర్ మున్సిపల్ వాటర్ ట్యాంక్‌లో 30 కోతులు మృతి చెందిన ఘ టన మరువక ముందే నల్గొండ మున్సిపాలిటీలో మృతదేహం పది రోజులుగా ఉన్నా పరిశీలించకపోవడం దారుణమన్నారు. ఇ దిలాఉంటే నల్గొండ పట్టణంలో వాటర్ ట్యాంకులో శవం సంఘటనపై స్థానిక సం స్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్రను విచారణ అధికారిగా నియమిస్తూ, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి, నివేదిక సమర్పించాలని ఆమె ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News