Thursday, January 23, 2025

సూట్‌కేసులో అర్ధనగ్న మృతదేహం….

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: సూట్‌కేసులో మృతదేహం కనిపించిన సంఘటన హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సెక్టార్ 28-29 బైపాస్ రోడ్డుపై రక్తపుమరకలతో ఉన్న సూట్ కేసు కనిపించడంతో పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. సూట్‌కేసును ఓపెన్ చేసి చూడగా పాలిథిన్ కవర్‌లో అర్థనగ్నం మృతదేహం కనిపించింది. ప్లాసిక్ తాడుతో కాళ్లు, చేతులు కట్టి ఉన్నాయి. మృతుడి వయసు 28 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు వెల్లడించారు. సెక్టార్-31 పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఫరీదాబాద్ ప్రాంతంలో మిస్సింగ్ కేసుల వివరాలను పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News