Friday, January 10, 2025

ప్రియురాలిని చంపి… మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టి కాలువలో పడేశాడు…

- Advertisement -
- Advertisement -

ముంబయి: ప్రియురాలిని చంపి అనంతరం మృతదేహాన్ని సూట్‌కేసులో ప్యాక్ చేసి కాలువులో పడేసిన సంఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నైగామ్‌లో నైనా మెహతా అనే యువతి మెకప్ ఆర్టిస్ట్, గ్రాఫిక్ డిజైన్‌ర్‌గా మనోహర్ శుక్లా ఒకే కంపెనీలో పని చేయడంతో ఇద్దరు పరిచయమయ్యారు. గత ఐదు సంవత్సరాల నుంచి ఒకే సంస్థలో ఇద్దరు పని చేస్తున్నారు. ఆగస్టు 12న తన కూతురు ఫోన్ స్పందించడంలేదని నైగామ్ పోలీస్ స్టేషన్‌లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

Also Read: చంద్రబాబు ప్రాణాలకు రక్షణ లేదు: పంచుమర్తి అనురాధ

నైగామ్‌లోని సన్‌టెక్ కాంప్లెక్స్‌లో నైనా నివసిస్తున్నారు. ఆ కాంప్లెక్స్ నుంచి మనోహర్ సూట్‌కేసుతో వెళ్తున్న దృశ్యాలు కనిపించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. తనని పెళ్లి చేసుకోకపోతే నైనా రేప్ కేసు పెడుతానని పలుమార్లు తనని బెదిరించడంతో హత్య చేశానని నిందితుడు ఒప్పుకున్నాడు. ఇద్దరు మధ్య అక్రమ సంబంధం ఉన్న విషయం నైనా కుటుంబ సభ్యులకు తెలుసునని నిందితుడి భార్య తెలిపింది. మృతదేహాన్ని నైగామ్ నుంచి వల్సాద్‌కు ఎలా తీసుకెళ్లారనేది పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News