Saturday, December 21, 2024

సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన మెడికల్ విద్యార్థిని మృతదేహం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: మెడికల్ విద్యార్థిని మృతదేహం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలోని తిమ్మాపురం మండలం నేమాం గెస్ట్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కాకినాడలోని సూర్యనారాయణపురం రంగయ్యనాయుడు వీధికి చెందిన వంకధరి శ్వేత(25) ఎంబిబిఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది. శ్వేత ప్రతీ రోజు ఇంటి నుంచి కాలేజీకి వెళ్లి వస్తుంది. బుధవారం ప్రాక్టికల్ క్లాసులు ఉండడంతో ఆమె తండ్రి శ్వేతను కాలేజీ దగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోయాడు. సాయంత్రం కాలేజీ నుంచి కూతురును తీసుకెళ్లేందుకు తండ్రి వెళ్తుండగా పోలీసులు అతడికి ఫోన్ చేశారు. కుమార్తె మృతదేహం సముద్రపు ఒడ్డున కనిపించిందని ఫోన్ చేయడంతో తండ్రి కన్నీంటి పర్యంతమయ్యాడు. దీంతో శ్వేత కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెడికల్ విద్యార్థి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా సముద్రంలోకి తోసేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సిసి కెమెరాలతో పాటు ఫోన్ కాల్ హిస్టరీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News