Wednesday, January 15, 2025

ఫతే నగర్ లో కొట్టుకపోయిన బాలుడు… హుస్సేన్ సాగర్ లో తేలిన మృతదేహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఫతే నగర్ డివిజన్ లోని ఇందిరాగాంధీ పురం నాలాలో బాలుడు పడి కొట్టుకపోయాడు. హుస్సేన్ సాగర్ లో బాలుడి మృతదేహం లభ్యమైంది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబానికి 20 వేల ఆర్థిక సాయం చేశారు. జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు నాలతో పడి చనిపోయాడని ఎమ్మెల్యే కృష్ణారావు మండిపడ్డారు. ఎమ్మెల్యే ఎన్నిసార్లు ఫోన్ చేసిన  జిహెచ్ఎంసి కమిషనర్ స్పందించడం లేదని విమర్శలు గుప్పించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News