Saturday, November 2, 2024

చంపారు… హోర్డింగ్ వెనక దాచారు….

- Advertisement -
- Advertisement -

Dead body kept behind of Hoarding in Jublihills

 

హైదరాబాద్: ఓ వ్యక్తిని చంపి హోర్డింగ్ వెనుక దాచిపెట్టిన సంఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విజిలేశ్ కుమార్ అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. జూబ్లీహిల్స్‌లోని ట్రావెల్స్‌కు చెందిన పార్కింగ్ స్థలంలో నివాసం ఉంటున్నాడు. హోర్డింగ్ సమీపం నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హోర్డింగ్ వెనుక భాగంలో మృతదేహం కనిపించింది. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉందని పోలీసులు వెల్లడించారు. మృతుడు యుపికి చెందిన విజిలేశ్‌గా గుర్తించారు. రెండు నెలల క్రితమే నగరానికి వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. హత్య చేసి మృతదేహాన్ని హోర్డింగ్ వెనక దాచి పెట్టారన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జులై 13 నుంచి విజిలేశ్ ఉద్యోగానికి రావడం లేదని లియో సెక్యూరిటీ ఎజెన్సీ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News