Wednesday, January 22, 2025

మహిళ మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: సిద్దిపేట పట్టణ శివారు హరిహర రెసిడెన్సీ సమీపంలో మహిళ మృత దేహం స్థానికంగా కలకలం సృష్టించింది. త్రీటౌన్ సిఐ భాను ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్‌కు చెందిన రాజమ్మ (40) అనే మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లి పోయింది. మహిళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తులో భాగంగా ఓ వ్యక్తిని విచారించగా రాజమ్మను చంపి సిద్దిపేట శివారులో పడవేసినట్లు తెలపగా, మేడ్చల్ పోలీసులు త్రీటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చి, మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News