Thursday, January 23, 2025

పిఎం కిసాన్ ఈ కెవైసి గడువు పెంచిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

Deadline for completing eKYC extended

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పిఎంకిసాన్) పధకానికి ఈ కెవైసి గడువు తేదిని పొడిగిస్తూ కేంద్ర పభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి ఈ కెవైసి గడువు ఈనెల 31తో ముగియనుంది. అయితే అధికశాతం రైతులు ఈ కెవైసిని చేసుకోలేకుపోవటతో మరికొంత సమయం ఇస్తూ చివరి తేదిని ఈ ఏడాది మే 22వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ.6వేలు అందజేస్తుంది. ఈ నిధులను రెండేసి వేల రూపాయల చొప్పున మూడు దఫాలుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుంది. ఈ పధకం ద్వారా నిధులు పొందేందకు రైతులు కచ్చితంగా ఆధార్ ఈ కెవైసిని పూర్తి చేసుకోవాలనే నిభంధన విధించింది. ఈ కెవైసి చేసుకోలేకపోతే పిఎం కిసాన్ పథకం నిధులు రైతులకాతాకు జమ కాకుండా నిలిపివేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద నిధులను వచ్చేనెల్లో రైతుల ఖాతాలకు జమ చేయనుంది. పిఎం కిసాన్ పథకానికి ఆధార్ ఈ కెవైసి అనుసంధానం అధికారిక వెబ్‌సైట్ ద్వారా చేసుకోవాలని ఈ మేరకు అధికారులు వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News